తండ్రి ఖాతా నుంచి డబ్బు వాడుకుని, కిడ్నీ అమ్మి డబ్బు తిరిగివ్వాలనుకుంది... కానీ..!

12-12-2022 Mon 19:49 | Andhra
Advertisement
  • హైదరాబాదులో నర్సింగ్ చదువుతున్న యామిని
  • యామిని స్వస్థలం గుంటూరు జిల్లా ఫిరంగిపురం
  • తండ్రి ఏటీఎం కార్డు ద్వారా రూ.2 లక్షలు ఖర్చు
  • ఆన్ లైన్ లో కిడ్నీ అమ్మేందుకు యత్నం
  • రూ.3 కోట్లు ఇస్తామంటూ సైబర్ మోసగాళ్ల ఎర
  • రూ.16 లక్షలు పోగొట్టుకున్న యామిని
Advertisement
ఓ అమ్మాయి తండ్రి ఖాతా నుంచి డబ్బు వాడుకుని, ఆ డబ్బు తిరిగి ఇచ్చేందుకు కిడ్నీ అమ్మాలని నిశ్చయించుకుంది. కానీ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుంది. 

గుంటూరు జిల్లా ఫిరంగిపురం గ్రామానికి చెందిన యామిని హైదరాబాదులో నర్సింగ్ కోర్సు అభ్యసిస్తోంది. తండ్రి ఏటీఎం కార్డు ద్వారా వ్యక్తిగత అవసరాల కోసం ఆమె రూ.2 లక్షల వరకు వాడుకుంది. అయితే, ఆ డబ్బు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. 

కిడ్నీ అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని భావించి ఆన్ లైన్ లో కనిపించిన ఓ ఫోన్ నెంబరుకు సందేశం పంపింది. దాంతో వారు ఆన్ లైన్ లో యామినిని సంప్రదించారు. యామిని అవసరాన్ని గుర్తించిన సైబర్ మోసగాళ్లు రూ.3 కోట్లు ఇస్తామని ఎర వేశారు.

అయితే, ఈ మొత్తాన్ని బదిలీ చేయాలంటే పన్నులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పి, ఆమె నుంచి పలు దఫాలుగా రూ.16 లక్షల వరకు రాబట్టారు. మోసగాళ్లు సృష్టించిన ఆన్ లైన్ అకౌంట్ లో రూ.3 కోట్ల మొత్తం కనిపిస్తుండడంతో ఇంకేమీ ఆలోచించకుండా వారు అడిగినంత మొత్తాన్ని చెల్లించింది. 

డాక్టర్ ప్రవీణ్ రాజ్ పేరిట పరిచయం చేసుకున్న మోసగాడు, ఆమెను ఢిల్లీ రావాలని సూచించాడు. ఆమె ఖాతాలో రూ.10 వేల నగదు కూడా జమ చేశారు. అయితే, ఢిల్లీ వెళ్లిన యామినికి అక్కడెవరూ కనిపించకపోవడంతో తాను మోసపోయానని గుర్తించింది. ఈ విషయం తండ్రికి తెలియజేసింది. 

అనంతరం తండ్రితో కలిసి ఆమె గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఈ సైబర్ మోసంపై స్పందిస్తూ, ఆన్ లైన్ లో కనిపించే అన్ వెరిఫైడ్ లింకులపై క్లిక్ చేయరాదని స్పష్టం చేశారు.
Advertisement
YaminiKidneyCyber CriminalsOnlinePhirangipuramGuntur District

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more